ETV Bharat / state

'ప్రేమ' ప్రేమికులకు ప్రేమగా ఓ లేఖ రాసింది.. అదేంటో చదువుదామా! - ప్రేమికుల దినోత్సవం స్టోరీలు

Valentines Day 2023: ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి పుట్టిందే ప్రేమికుల దినోత్సవం. అయితే ఈ దినోత్సవం నాడు... 'ప్రేమ' ప్రేమికులకు ప్రేమగా ఓ లేఖ రాసింది. అదేంటో చదివేద్దాం పదండి.

Valentines Day
Valentines Day
author img

By

Published : Feb 14, 2023, 6:31 AM IST

Valentines Day 2023: మీ మనసులో మాటలన్నీ విన్నాక... నా మదిలోని మాట మీకు చెప్పాలనిపించింది. ప్రేమికుల రోజు వస్తోంది. గిఫ్ట్‌లు ఏం కొనాలో ఆలోచించేసి ఉంటారు. ప్రేమించేవారిని ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్‌ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్‌బుక్‌ పేజీలో ఏ కవిత పోస్ట్‌ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇన్ని చేసే మీరు ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుందని.. ఈర్ష్య, ద్వేషం, మోసం, కుట్ర, అపార్థం, అపనమ్మకం ఉండవని గుర్తు చేసుకోరా?

నింగికి నేలంటే ప్రేమ... వర్షించి పరిమళాలు అద్దుతుంది.

ప్రేమికులైతే నమ్మకాన్ని వర్షించాలి. బంధం పరిమళిస్తుంది.

నేలకు చెట్టంటే ప్రేమ..నీరిచ్చి పెంచుతుంది.

ప్రేమికులైతే నేనున్నానని భరోసానివ్వాలి. అన్యోన్యం పెరుగుతుంది.

చెట్టుకు మనిషంటే ప్రేమ... ఊపిరి పోస్తుంది.

ప్రేమికులైతే స్వేచ్ఛ గాలులు పీల్చనివ్వాలి. ప్రేమ ప్రాణం పోసుకుంటుంది.

... ఆ ప్రేమ ఎందరో జీవితాలకు ప్రాణం పోస్తుంది. ఎన్నో గమ్యాలు చేరుకొనే మార్గం చూపుతుంది. ఎన్నో లక్ష్యాలకు విజయం అందిస్తుంది.

అదే ఈర్ష్య వర్షిస్తే.. ప్రేమ బలహీనపడుతుంది. మోసం నీరుగా పోస్తే... కన్నీరై విలపిస్తుంది. అపార్థం చొరబడితే.. ఊపిరి ఆగిపోతుంది. ప్రేమ చచ్చిపోతుంది.

అమ్మాయి నచ్చిందంటున్నారు... మీరు ఆమెకు నచ్చాలిగా..!

అబ్బాయి వదిలేశాడంటున్నారు... అతనికొచ్చిన కష్టమేంటో చూసుకోవాలిగా..!

అమ్మాయి మోసం చేసిందంటున్నారు... ఆమె పరిస్థితి అర్థం చేసుకోరా!

అమ్మానాన్నలు ఒప్పుకోవడం లేదంటున్నారు.. అర్థమయ్యేట్లు చెప్పారా!

ప్రేమించడం లేదన్నా ప్రేమించండి. ద్వేషించి యాసిడో, కత్తో ఎత్తకండి.

ప్రేమించే వరకూ ప్రేమించండి... బాధతో నుయ్యో, గొయ్యో చూసుకోకండి.

ప్రేమను ఒప్పుకొనేదాక ప్రేమించండి.. కోపంతో వెళ్లిపోకండి. బంధం తెంచుకోకండి.

ప్రేమిస్తున్నామంటే...ప్రేమ ఇస్తున్నామని... ఇవ్వడానికి ఎవ్వరూ అడ్డు చెప్పరు కదా!

నువ్వు ఇస్తూ పో... ప్రేమే ప్రేమను పుట్టిస్తుంది. బతికిస్తుంది. గెలిపిస్తుంది.

యువతీ, యువకులు ప్రేమించుకుంటారు. వీరిని తల్లిదండ్రులూ ప్రేమిస్తారు. అందరిలోనూ ప్రేమే ఉన్నప్పుడు.. బతకాలి గానీ, చావడం ఏంటి? చంపడం ఏంటి?

చచ్చేదో, చంపేదో అయితే ప్రేమ కాదేమో... దాన్ని ఇంకేమైనా అనాలేమో!

ఇలాంటి ఆలోచనలని ప్రేమ మాత్రం అనకండి... ఎందుకంటే నేను చంపను. చావను.

ప్రాణమవుతాను. ప్రాణం పోస్తాను. ప్రాణంగా బతుకుతాను. బతుకుతూనే ఉంటాను.

- ఇట్లు మీ ప్రేమ.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.