గుంటూరు జిల్లా తాడికొండ వద్ద జరిగిన ప్రమాదంలో అన్నయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. చెల్లి అపస్మారకస్థితిలో వెళ్లింది. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన వంశీ, అతని సోదరి కీర్తి.. గుంటూరులోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. కాలేజీకి వెళ్లిన కీర్తి.. తిరుగు ప్రయాణంలో తాడికొండ క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగింది. అక్కడి నుంచి అన్నయ్య వంశీతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు.
తాడికొండ అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా.. ఓ కంటైనర్ లారీ వాళ్ల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంశీ అక్కడికక్కడే మృతి చెందగా.. కీర్తికి బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రి తరలించారు. కీర్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తాడికొండ పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోర్టుమార్టం నిమిత్తం వంశీ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి..
గుంటూరులో సింథటిక్ డ్రగ్స్.. ముగ్గురు బీటెక్ విద్యార్థులు అరెస్టు