ETV Bharat / state

వలస కార్మికులకు అండగా ప్రభుత్వం - guntur lockdown updates

వలస కార్మికుల దయనీయ పరిస్థితులు గ్రహించిన ప్రభుత్వం.. వారిని సొంతూళ్లకు పంపే ప్రక్రియ చేపట్టింది. రహదార్లపై నడిచివెళ్తున్న వలసకార్మికుల కష్టాలపై... ఈటీవీ భారత్ - ఈనాడు కథనాలకు స్పందించింది. వలస కూలీలకు భోజన సదుపాయాలు కల్పించి సేద తీర్చేందుకు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసింది. కిలోమీటర్ల మేర సైకిళ్లపై కొందరు నడుచుకుంటూ వస్తుండగా.. జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన శిబిరాలు వారికి ఉపశమనమిస్తున్నాయి.

వలస కార్మికులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం

author img

By

Published : May 18, 2020, 2:02 PM IST

వలస కార్మికులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం

లాక్‌డౌన్ వేళ వలస కార్మికుల పాట్లు అన్నీ.. ఇన్నీ కావు. ఉపాధి కరవై దూర ప్రాంతాల్లో ఉన్న సొంతూళ్లకు చాలామంది కాలినడకనే బయలుదేరారు. పిల్లాపాపలను ఎత్తుకుని.. సామగ్రి నెత్తిన పెట్టుకుని... పయనమైన దయనీయ పరిస్థితులు... చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. మండే ఎండలు.... కాలే కడుపులతో.... వందలాది కిలోమీటర్ల మేర వారు సాగిస్తున్న పయనం... మనసున్న ప్రతిఒక్కరినీ కదిలించింది.

ఈ సమస్యను ఈటీవీ భారత్ - ఈనాడు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి... వలస కూలీల ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చారు. స్పందించిన ప్రభుత్వం.. సమీక్ష నిర్వహించి వలస కూలీల సంక్షేమానికి చర్యలు చేపట్టింది. నడిచి, సైకిళ్లు, ట్రక్కులపై ఎవరూ వెళ్లకుండా అధికారులు వారిని ఆపి తాత్కాలిక శిబిరాలకు తరలించారు. జాతీయ రహదారిపై ఆయా రాష్ట్రాల వారికి అర్థమయ్యే భాషల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

శిబిరాలకు తీసుకువచ్చి భోజనం, తాగునీరు అందిస్తున్నారు. ఒడిశా వాసులను బస్సుల్లో పంపిస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు శ్రామిక రైళ్ల ద్వారా వలస కార్మికులను పంపుతున్నారు. శిబిరాల్లో ఏర్పాట్లపై కూలీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వలస కార్మికులను తాత్కాలిక శిబిరాలకు తీసుకువస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... స్పందన యాప్‌లో వారి పేర్లు నమోదు చేస్తున్నారు. క్వారంటైన్ ఏర్పాట్ల నిమిత్తం ఆయా రాష్ట్రాలకు వారి వివరాలు పంపిస్తున్నారు. తాత్కాలిక శిబిరాల నిర్వహణలో గ్రామ కార్యదర్శులు, వాలంటీర్ల సేవలు వినియోగిస్తున్నారు. ఎవరూ రహదారి వెంబడి నడిచి వెళ్లవద్దని ప్రభుత్వమే వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

బీహార్​కు బయలుదేరిన మూడో రైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.