ETV Bharat / state

తక్కెళ్లపాడు చెత్త కుప్పలో పేలుడు..పారిశుద్ధ్య కార్మికులకు గాయాలు - thakkellapadu dustbin

పారిశుద్ధ్య కార్మికులు చెత్త కుప్ప నుంచి చెత్త తీస్తుంటే ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ముగ్గురికి గాయాలుకాగా... బాధితులను ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్ల పాడులో జరిగింది

A bomb exploded in  dustbin at thakkellapadu
తక్కెళ్లపాడు చెత్త కుప్పలో పేలిన బాంబు
author img

By

Published : Oct 5, 2020, 3:09 PM IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్ల పాడు గ్రామంలో చెత్త కుప్పలో పేలుడు కలకలం రేపింది. గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులు శేషగిరి, శివ, నాగేశ్వరరావు కాలువ పక్కన పేరుకున్న చెత్త తొలగించే ప్రయత్నం చేశారు ఇంతలో అక్కడ ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. పది అడుగుల మేర చెత్త ఎగిసిపడింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం బాంబు స్క్వాడ్ పరిశీలించి బాంబు ఆనవాళ్లు ఏమీ లేవని గుర్తించారు. గ్యాస్ వెల్డింగ్ ఉపయోగించే కార్బైడ్ కానీ ఏదైనా రసాయనాల మిశ్రమం అయి ఉండొచ్చని నిర్ధరణకు వచ్చారు. ఈ పేలుడు కారణంగా పంచాయతీ కార్మికులైన శేషగిరి, శివ, నాగేశ్వరరావులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు .

ఇదీ చూడండి. సరిహద్దు వివాదం...ముగ్గురిపై సీఆర్పీఎఫ్ ఉద్యోగి కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.