- చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో అపశ్రుతి, ఇద్దరు మహిళలు మృతి..
గుంటూరు జిల్లాలో చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన ప్రదేశంలోని తొక్కిసలాటలో ఒక మహిళ, గుంటూరు జీజీహెచ్‌లో మరో మహిళ మృతి చేందినట్లు అధికారులు తెలిపారు. చంద్రబాబు వెళ్లిన తర్వాత తొక్కిసలాట జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మహిళల మృతి ఘటనతో టీడీపీ నేతలు కానుకల పంపిణీ నిలిపివేశారు.
- రామతీర్ధం ధ్వంసానికి రెండేళ్లు.. దోషులు ఇంకా దొరకలేదా..!: తెదేపా నేత కళా
Kalavenkata Rao Comments: రామతీర్థంలోని రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసి రెండేళ్లు గడిచినా.. ఇప్పటికీ దోషులను పట్టుకోలేక పోయారని టీడీపీ నేత కళావెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథాన్ని దగ్ధంచేస్తే పిచ్చివాడి చర్యగా కొట్టిపారేశారని ధ్వజమెత్తారు.
- రెండు మూడు నెలల్లో విశాఖ రాజధానిగా పరిపాలన : బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana : విశాఖ రాజధాని పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖ రాజధాని ఏర్పడుతుందని అన్నారు.
- కాపు రిజర్వేషన్లపై హరిరామజోగయ్య పోరాటం.. రేపు పాలకొల్లులో నిరాహారదీక్ష
Former MP Hariramazogaiah About Kapu Reservations: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్లపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినా స్పందన లేకపోవడతో.. రేపు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు
- న్యూఇయర్ రోజు విషాదం.. ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి
ఓ పికప్ వ్యాన్.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మరణించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. మరోవైపు, ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
- కుంచెతో చిన్ని కృష్ణయ్యకు జీవం.. ఆలయాలకు పెయింటింగ్స్ కానుకగా ఇచ్చిన ముస్లిం
కేరళకు చెందిన ఓ ముస్లిం మహిళ వందలాది పెయింటింగ్స్ వేస్తూ.. దేవాలయాలకు అందిస్తున్నారు. తాజాగా మరో 101 పెయింటింగ్స్ వేసి గురువాయుర్ శ్రీకృష్ణుడి దేవాలయానికి న్యూ ఇయర్ సందర్భంగా సమర్పించారు.
- మిలిటరీ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు పేలుడు.. 10మంది మృతి.. 8 మందికి గాయాలు
అఫ్గానిస్థాన్‌లో విషాదకర ఘటన జరిగింది. కాబుల్ మిలిటరీ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
- వంట గ్యాస్ ధర పెంపు.. సిలిండర్‌కు ఎంతంటే..
LPG price hike today : వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.25మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,769కి చేరింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.
- లక్షలాది బిర్యానీలతో 2023కి టేస్టీ వెల్కమ్.. బావర్చీలో నిమిషానికి రెండు.. స్విగ్గీ రికార్డ్!
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆహార ప్రియులు అత్యధికంగా బిర్యానీని ఆరగించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. హైదరాబాదీ బిర్యానీకే అత్యధిక కస్టమర్లు మొగ్గు చూపినట్లు పేర్కొంది.
- ఏంటి ఈ తెలుగు అందం ధరించిన లెహెంగ అంత కాస్ట్లీనా
తెలుగు అందం శోభితా ధూళిపాళ తమ గ్లామర్ యాక్టింగ్‌తో కుర్రాళ్ల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ధరించిన ఓ లెహెంగా అందరిని ఆకట్టుకుంది. దీని ఖరీదు తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రూ.81 వేలా అని నోరు వెళ్లబెట్టుతున్నారు.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - Telugu latest news
.
ఏపీ ప్రధాన వార్తలు