ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న700 బస్తాల రేషన్ బియ్యాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సూచనలు మేరకు.. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామం నుంచి కాకినాడ వెళుతున్న లారీని మేడికొండూరు పోలీసులు తనిఖీ చేయగా... 700 బస్తాలు బియ్యం కనిపించాయి. పరిశీలించి చూడగా చౌక బియ్యం అని గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకోవటంతోపాటు..బియ్యాన్ని సీజ్ చేశారు. మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి పిలుపునకు వచ్చి నగలు చోరీ