గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 562 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57, 942 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 169 ఉన్నాయి.
అచ్చంపేటలో 10, సత్తెనపల్లి 23, తాడికొండ 23, చిలకలూరిపేట19, వినుకొండ 12, బట్టిబ్రోలు 27, బాపట్ల 17, చేబ్రోలు 20, చెరుకుపల్లి 57, కర్లపాలెం 10, పొన్నూరు 18, రేపల్లె 18, తెనాలిలో 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 50 వేల 948 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో మొత్తం మరణాల సంఖ్య 544 కు చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: