ETV Bharat / state

ATM CHORI: వీళ్లు చెడ్డీ గ్యాంగ్ కాదండోయ్.. చెడ్డీ దోస్తులు.. కానీ!

వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. కాలం చెల్లిన వాహనాలను పగులగొట్టే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసయ్యారు. ఎలాగైనా సరే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నారు. అందుకోసం వాహనాలకు బదులుగా ఓ ఏటీఎంను(ATM CHORI) పగలగొట్టాలనుకున్నారు. మంచి ముహూర్తం చూసుకొని ఏటీఎం పగలగొట్టే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నారు.

2 PEOPLE ARRESTED ATM CHORI CASE IN GUNTUR
వీళ్లు చెడ్డీ గ్యాంగ్ కాదండోయ్.. చెడ్డీ దోస్తులు.. కానీ!
author img

By

Published : Nov 23, 2021, 9:18 AM IST

ATM CHORI: గుంటూరు జిల్లా కోడిగుడ్డు సత్రం వెనుక బజార్​లో ఉండే షేక్ అబ్దుల్, రహీంలు చిన్ననాటి నుంచే స్నేహితులు. వీరిద్దరూ మాయాబజార్​లో కాలం చెల్లిన వాహనాలు పగులగొట్టే పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా మద్యం, జల్సా జీవితాలకు అలవాటుపడ్డారు. ఇలా కష్టపడి పనిచేస్తూ.. తమకిష్టమైనవి చేయలేమని.. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నారు. అందుకోసం ఏటీఎంను పగలగొట్టాలనుకున్నారు. రెక్కీ చేసి మరీ ఎక్కడి ఏటీఎంను పగలగొట్టాలి, ఎలా తప్పించుకోవాలో... పథకం పన్నారు.

రంగంలోకి ఎస్సై సోదరుడు...

అందులో భాగంగానే ఇద్దరూ కలిసి పట్టణంలో ఓ ఇంటి ముందు ఉంచిన ద్విచక్రవాహనాన్ని దొంగిలించారు. పెదకాకాని పరిధిలోని ఆటోనగర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో హైటెక్ కంపెనీ ఏటీఎంను పగలగొట్టే ప్రయత్నం చేశారు. విషయం గుర్తించిన వాచ్​మెన్ 100 నంబర్​కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. తమ ఇంటికి దగ్గరలోనే దొంగతనం జరుగుతున్నందున.. ఎస్సై వినోద్ కుమార్ తన సోదరుడు వినయ్​కు అక్కడికి వెళ్లమని చెప్పాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వినయ్... ఇద్దరు దొంగలను పట్టుకున్నాడు. పోలీసులు వచ్చే వరకు వారిని ఎటు వెళ్లనీయకుండా చేశాడు.

పెదకాకాని సీఐ సురేష్ బాబు, ఎస్సై వినోద్ కుమార్​ పలువురు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు. చోరీ జరుగుతుందని సమాచారం ఇచ్చిన వాచ్​మెన్​కు, చాకచక్యంగా నిందితులను పట్టుకున్న ఎస్సై సోదరుడు వినయ్ కుమార్​కు ప్రభుత్వం తరఫున అవార్డులను అందజేశారు.

ఇదీ చూడండి: Food Poison: కలుషిత ఆహారం తిని.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.