మూడు రాజధానులు వద్దు.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నాలు... 177వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తుళ్లూరు, అనంతవరం, మందడం, మల్కాపురం, రాయపూడి, దొండపాడు గ్రామాల్లోని... రైతులు, మహిళలు తమ ఇళ్ల వద్దే ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతికి మద్ధతుగా నినాదాలు చేశారు.
వైకాపా ప్రభుత్వం దళిత రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెంచిన పెన్షన్, కౌలు డబ్బులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. న్యాయస్థానాలే తమకు న్యాయం చేస్తాయని రైతులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారంతా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: