ETV Bharat / state

బుర్రిపాలెంలో 12మంది పందెం రాయుళ్లు అరెస్ట్

author img

By

Published : Apr 5, 2021, 8:32 AM IST

తెనాలిలోని బుర్రిపాలెంలో కోడిపందాలు ఆడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

12 betting batch arrested
12 betting batch arrested

గుంటూరు జిల్లా బుర్రిపాలెం పరిధిలో కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసు బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 12 మంది పట్టుబడ్డారు. వారి నుండి రూ. 8,500 నగదు, 3 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మురళీ తెలిపారు. జూదాలకు ఎవ్వరు పాల్పడినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ గ్రామాల పరిధిలో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగడితే వెంటనే గ్రామస్థులు తమకు సమాచారాన్ని అందించాలని కోరారు.

ఇదీ చదవండి: 8న పరిషత్​కు పోలింగ్‌.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.