కృష్ణానది ఉగ్రరూపంతో... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో దాదాపు 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మంగళవారం అర్ధరాత్రి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగటంతో మిరప, కంది అరటి తోటలు జలమయం అయ్యాయి. నీటి ప్రవాహాన్ని సీడబ్ల్యూసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాడేపల్లి మహానాడులో 8.3 మీటర్ల ఉన్న నీటి ప్రవాహం 11మీటర్లకు చేరితే ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇవాళ రాత్రికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో... ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీతానగరం ప్రాంతంలో శివాలయం నీట మునిగింది. కరకట్ట ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరద నీరు రాకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరకట్ట దిగువన వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించారు. వరద పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: పులిచింతలకు జలకళ... దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం