చిలకలూరిపేట పట్టణం మద్ది నగర్ లో బిలాల్ అనే వ్యక్తి పెంచుకుంటున్న 10 నాటు కోళ్లు ఒకేసారి మృతి చెందాయి. బోనులో ఉంచిన కోళ్లను బయటకు వదిలేందుకు వెళ్లగా అప్పటికే అవి మృతి చెంది ఉండటాన్ని గమనించి ఆందోళన చెందాడు.
ఇన్ని కోళ్లు ఒకే సారి మరణించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో.. పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి.. కోళ్లను పరిశీలించాలని.. తమ అనుమానాలను నివృత్తి చేయాలని అక్కడి ప్రజలుు కోరుతున్నారు.
ఇదీ చదవండి: