ETV Bharat / state

young man kidnap: విశాఖ ఘటన మరువక ముందే... ఏలూరులో యువకుడి కిడ్నాప్​ కలకలం - young man Kidnapped in Eluru Government Hospital

Young man was kidnapped: విశాఖలో జరిగిన ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ ఘటన మరువక ముందే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో యువకుడిని కారులో కొందరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసును పోలీసులు 12 గంటల వ్యవధిలో ఛేదించారు.

Young man was kidnapped
విశాఖ ఘటన మరువక ముందే ఏలూరులో యువకుడి కిడ్నాప్​ కలకలం
author img

By

Published : Jun 16, 2023, 8:54 PM IST

Young man was kidnapped: ఏలూరులో గత రాత్రి ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ ఘటన నిన్న రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గత రాత్రి పది గంటల సమయంలో ఒక వ్యక్తిని కారులో కొందరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేశారనే సమాచారంపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్​పీ శ్రీనివాసులు, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి వద్ద సీసీ టీవీ ఫుటేజ్​ను పరిశీలించి.. దాని ద్వారా కిడ్నాప్ ఛేదించారు.. 12 గంటల వ్యవధిలో ఛేదించి కిడ్నాప్​కు కారణమైన మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

మహిళతో పరిచయమే కారణం.. చేబ్రోలు రైల్వే స్టేషన్ మాస్టర్ పుట్టి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో.. రెండు సంవత్సరాల క్రితం అప్పటికే పెళ్లి అయ్యి భర్త చనిపోయి ఉన్న పంచకర్ల గ్రీష్మ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతుం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తోంది. ఆమెతో కూడా విభేదాలు రావడంతో కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. నిన్న రాత్రి ఆమెతో మాట్లాడేందుకు చంద్రశేఖర్‌ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అయితే ఆమెతో మాట్లాడటానికి వచ్చిన చంద్రశేఖర్​ను మాదేపల్లికి చెందిన బాలి బోయిన నవహర్ష అనే వ్యక్తి మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి తన ఏపీ 39 ఏహెచ్ 2222 నెంబర్ గల జీపులో బలవంతంగా ఎక్కించుకుని పోణింగి వైపు తీసుకెళ్లారు.

12 గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు.. చంద్రశేఖర్​ను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికు తీసుకువెళ్లి వారంతా చంద్రశేఖర్​ని కర్రలతోనూ చేతులతోనే ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ తరువాత ఖాళీ ప్రామిసరీ నోట్ల పైన ఇతర డాక్యుమెంట్ల పైన సంతకాలు చేయించుకున్నారు. మళ్లీ గ్రీష్మను కలిస్తే చంపుతామని బెదిరించి వదిలేసినట్లుగా అతను ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చాడు. దీనిపై ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లోకేసు నమోదు చేశారు. 12 గంటల వ్యవధిలో ఈ కేసును ఛేదించి దీనికి సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసి.. వారి వద్ద ఉన్న కారు, ఇతర పేపర్లను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్​కి వాడిన కారు అధికార పార్టీ మాజీ మంత్రికి సన్నిహితంగా ఉన్న ఓ ఛోటా నాయకుడు నవహర్షదిగా పోలీసులు గుర్తించారు.

నిన్న రాత్రి ఏలూరు గవర్నమెంట్​ ఆసుపత్రి దగ్గర బొలేరో వాహనంలో కొంత మంది వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తిని కిడ్నాప్​ చేస్తుంటే సెక్యురిటీ ఇన్చార్జ్​గా చేసే ఒక వ్యక్తి వీడియో తీసి నాకు పంపించడం జరిగింది.. అలానే ఆ బండి నంబరును కూడా నాకు పంపించాడు. వెంటనే మా సిబ్బందిని అలర్ట్​ చేశాం. కొద్దిపాటి సమయంలోనే నిందితులను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.- చంద్రశేఖర్, టూ టౌన్​ సీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.