Vikas College Management Attack: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం కానిస్టేబుల్‌పై దాడి చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పలు పాఠశాలలు, కళాశాలలకు పండుగ చేసుకోవడానికి స్థానిక పోలీసులు అనుమతులు ఇచ్చారు. అయితే ఆ సమయం దాటినా వికాస్ కళాశాలలో వేడుకలు నిర్వహించడంతో పరిసరవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాల వద్దకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ మోసే సిబ్బంది సమయం దాటిపోయిందని తక్షణమే ముగించాలని చెప్పారు.
దీనిపై కళాశాల డైరెక్టర్ జగన్, అధ్యాపకులు ఇంకా సమయం ఉందని వారితో వాదించారు. దీంతో పోలీసులు కళాశాల యాజమాన్యం మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ పై పెట్రోల్ పోసి దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సీఐ ఘటన స్థలానికిచేరుకుని కానిస్టేబుల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కళాశాల డైరెక్టర్ జగన్ ,ఉపాధ్యాయులు ,మరికొందరిపై కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.
ఇవీ చదవండి