ETV Bharat / state

State Govt Constructions in Polavaram Project: ఇష్టారీతిన పోలవరం నిర్మాణ పనులు.. కేంద్రం మాట వినని జగన్​ సర్కార్​ - Polavaram news

State Govt Constructions in Polavaram Project: పోలవరం నిర్మాణ పనుల్లో ఒకడుగు ముందుకు పడితే రెండడుగులు వెనక్కిపడుతున్నాయి. డయాఫ్రంవాల్ దెబ్బతినడం, ప్రధాన డ్యాంను వరద నీరు ముంచెత్తడం, గైడ్‌బండ్‌ కుంగటం వంటి ఆటంకాలు ఎదురవుతుంటే.. కేంద్ర సంస్థలు, నిపుణుల సూచనలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పనులు చేపట్టడంతో కేంద్ర పెద్దలే విస్తుపోతున్నారు. ప్రధాన డ్యాంలోనే సీపేజీ నీటిని దిగువకు పంపేందుకు డిప్లీటింగ్‌ స్లూయిస్‌ నిర్మాణం చేపట్టింది. దీన్ని చేపట్టొదని ముందునుంచీ వారిస్తున్న పోలవరం అథారిటీ.. విషయాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లింది.

state_govt_constructions_in_polavaram_project

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 8:14 AM IST

Updated : Sep 3, 2023, 11:48 AM IST

State Govt Constructions in Polavaram Project: ఇష్టారీతిన పోలవరం నిర్మాణ పనులు.. కేంద్రం మాట వినని జగన్​ సర్కార్​

State Govt Constructions in Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌లో ఇష్టానుసారం పనులు జరిగిపోతున్నాయి. కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండానే పనులు చేస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎంతో కీలకమైన ఈ సంస్థలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తోందని తెలుస్తోంది. దీనిపై పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, కేంద్ర జల్‌శక్తిశాఖ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. పోలవరంలో ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య సీపేజీ వల్ల పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంచనాలకు మించి నీరు వచ్చి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. దీన్ని ఇంకా కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ నిపుణులు వచ్చి పరిశీలించలేదు. ఈలోగా దిగువ కాఫర్‌ డ్యాం కుడివైపున ఒక కొండతో అనుసంధానమయ్యే చోట తవ్వకాలు జరిపి డిప్లీటింగ్‌ స్లూయిస్‌ నిర్మాణపనులు రాష్ట్రం మొదలుపెట్టేసింది. ఇలాంటి ప్రతిపాదనను పీపీఏ దృష్టికి తీసుకువెళ్లినా వారు అనుమతివ్వలేదు.

Central Government on Polavaram Project రంగంలోకి దిగనున్న కేంద్రం.. పోలవరం ప్రాజెక్టుపై లోతుగా దర్యాప్తు

Polavaram Authority complaint to Central Hydropower Department: దిగువ కాఫర్ డ్యాం వద్ద ఎలాంటి తవ్వకాలు జరపొద్దని.. అలా చేస్తే మళ్లీ దిగువ నుంచి నీరు ప్రధాన డ్యాంలోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వినకుండా పనులు ప్రారంభించడంతో కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో పీపీఏ ఫిర్యాదు చేసింది. ఈ విషయం విని కేంద్రజల్‌శక్తి కార్యదర్శి సైతం విస్తుపోయారు. ఇప్పటికే పోలవరం నిర్మాణ పనుల్లో ఎన్నో అవాంతరాలు ఎదురైన తరుణంలో కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉండగా.. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో కేంద్ర పెద్దలు విస్తుపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులన్నింటికీ డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ అనుమతి తీసుకున్నాకే చేశారు. తర్వాత ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం పోలవరంలో పెను సమస్యలకు దారితీసింది. కాఫర్‌ డ్యాంలు నిర్మించకుండా, డయాఫ్రం వాల్‌ నిర్మించడం తప్పని సీఎం, మంత్రులు విమర్శిస్తున్నారు. అన్ని అనుమతులూ ఉండి చేస్తేనే విమర్శిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. అసలు ఎలాంటి అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్న.

Polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద మరో పెనుసవాలు.. కాఫర్‌డ్యాం నుంచి వెనక్కి లీకవుతున్న నీరు

Depleting sluice type construction in Polavaram project: ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తిన నీరు బయటకు పంపించేలా దిగువ కాఫర్‌ డ్యాం వద్ద డిప్లీటింగు స్లూయిస్‌ తరహా నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం దిగువ కాఫర్‌ డ్యాం వద్ద తవ్వకాలు చేపడుతున్నారు. బటర్‌ఫ్లై తరహాలో వాల్వ్‌ రూపంలో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన డ్యాంలో నీటిని గ్రావిటీ ద్వారా దిగువకు పంపడంతోపాటు.. దిగువ నుంచి ఎగువకు నీరు రాకుండా.. ఈ నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దిగువ కాఫర్‌ డ్యాం కుడివైపు కొండను కలిసేచోట అప్రోచ్‌ ఛానల్‌లా తవ్వుతారు. నీరు దిగువకు వెళ్లేటప్పుడు తెరుచుకునేలా, ఎగువకు నీరు రాకుండా మూసి ఉంచే ఏర్పాటు చేస్తున్నారు.

దిగువ కాఫర్‌ డ్యాం దిగువన +16 మీటర్ల నీటిమట్టం ఉన్నప్పుడు ఎగువ నీరు గ్రావిటీ ద్వారా వెళ్లిపోయేలా చేయాలనేది ప్రణాళిక. ఈ ఆలోచనకు కేంద్రం నుంచి అనుమతి రాలేదని తెలిసింది. ఇంకా డిజైన్లు కూడా సమర్పించాలి. కేంద్ర జల్‌శక్తి శాఖ వర్గాల సమాచారం ప్రకారం పీపీఏ ఈ పని చేపట్టవద్దని అభ్యంతరం చెప్పింది. దిగువ కాఫర్‌ డ్యాం వద్ద ఎలాంటి పని చేసినా మరో సమస్య వస్తుందేమో చూడాలని చెప్పినట్లు సమాచారం. అలాంటిది అనుమతి లేకుండానే ఇప్పటికే తవ్వకం పనులు 20శాతానికిపైగా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ విషయమే జల్‌శక్తిలో చర్చనీయాంశమయింది.

Chandrababu on Polavaram: జగన్ అనే శని పోతే తప్ప.. పోలవరం కల సాకారం కాదు: చంద్రబాబు

Many hiccups in Polavaram project works: ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీపై కూడా గతంలోనే కేంద్రం పలుసార్తు హెచ్చరించినా రాష్ట్ర అధికారులు జాగ్రత్తపడలేదని సమాచారం. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీ ఎక్కువగా ఉంది. అధ్యయనం చేసి చర్యలు తీసుకోకపోతే పని సీజన్‌ కోల్పోతామని కేంద్ర సంస్థలు హెచ్చరించినా రాష్ట్ర అధికారులు స్పందించలేదని తెలిసింది. ఎగువ కాఫర్‌ డ్యాంకు పైవైపున గోదావరి నీటిమట్టం 39 మీటర్ల స్థాయిలో ఉంటే దిగువన ప్రధాన డ్యాం ప్రాంతంలో 14 మీటర్ల వరకు నీరు ఉండొచ్చని అంచనా వేశారు. ఆ మధ్య ప్రాంతంలో నేల ఎత్తు దాదాపు అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి అది పెద్ద సీపేజీ కాదని, ఆ నీటిని సులభంగా ఎత్తిపోసుకుంటూ పనులు చేసుకోవచ్చని అంచనాలు వేసుకున్నారు. అలాంటిది 22 మీటర్ల వరకు కూడా సీపేజీ నీరు నిలిచిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి ముందే ఇద్దరు ప్రొఫెసర్లు ఎంత సీపేజీ ఉంటుందో అంచనాలు రూపొందించారు. నాడు పాటించిన ఫార్ములాలో కొన్ని విలువలు సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ అంచనాల్లో తేడాలు వచ్చాయని ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు.

Last Updated : Sep 3, 2023, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.