ETV Bharat / state

Kolleru Lake: కొల్లేరు గల్లంతవుతోంది.. చేపల చెరువుల అక్రమ సామ్రాజ్యం! - కొల్లేరు సరస్సు నవీకరణ

Encroachment of Kolleru Lake: కొంప కొల్లేరనేది పాతకాలం సామెత! ఇప్పుడు ఆ కొల్లేరే గల్లంతయ్యే పరిస్థితి. వైఎస్సార్సీపీ చేపలు ఇప్పటికే వేల ఎకరాలు మింగేశాయి. అధికార మాఫియా కొల్లేరును సొంత సామ్రాజ్యంలా చెరబట్టేసింది. కొత్తవాళ్లు కొల్లేరులోకి ప్రవేశిస్తే.. బయటకు వెళ్లేదాకా తరుముతుంది. అనధికారిక నిఘా వేసి వెంటాడుతుంది.

కొల్లేరు సరస్సు ఆక్రమణ
కొల్లేరు సరస్సు ఆక్రమణ
author img

By

Published : Jul 2, 2023, 3:58 PM IST

Encroachment of Kolleru Lake: కొల్లేరు విధ్వంసానికి ఇదో పరాకాష్ట..! ఇక్కడ చెరువు తవ్వకానికి టెంకాయ కొట్టింది... ఏలూరు జిల్లా కైకలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు..! ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రానికి కూతవేటు దూరంలోనే 50 ఎకరాల విస్తీర్ణంలో ఇలా చెరువు తవ్వకానికి తెగించారు. అటవీశాఖ అధికారులు వచ్చి కొల్లేరులో తవ్వడం చట్టవిరుద్ధమంటూ.. రెండు యంత్రాలను సీజ్ చేశారు. మరి పొక్లెయిన్‌ చెక్‌పోస్టులు దాటి వెళ్తున్నప్పుడే అటవీ అధికారులు ఎందుకు అడ్డుకోలేదు..? అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారో తెలియని అమాయకులా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం ఇక్కడ శుద్ధ దండగ. ఎందుకంటే కొల్లేరు విధ్వంసకాండ బహిరంగ రహస్యమే. జరిగేదంతా మాఫియా కనుసన్నల్లోనే. ఈటీవీ-ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో కైకలూరు, మండవిల్లి, ఆకివీడు, ఏలూరు రూరల్ మండలాల్లో కొల్లేరు ఆక్రమణలు స్పష్టంగా కన్పించాయి.

అధికారుల ప్రేక్షక పాత్ర... ఇక్కడ చెక్‌పోస్టులు నామ్‌కేవాస్తే.! అక్రమాలకు గేట్లు ఎత్తడానికి తప్ప అడ్డుకోడానికి కానేకాదన్నది జగమెరిగిన సత్యం. ఒకవేళ అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకునేందుకు సాహసిస్తే వాళ్లకు అక్కడ అదే ఆఖరి డ్యూటీ ! తెల్లారేసరికి బదిలీ అయిపోతారు. ఇటీవలే ఓ అటవీశాఖ ఉన్నతాధికారి.. అక్రమ చెరువుల తవ్వకాల గురించి ఆరా తీసి ఆ మర్నాడే వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. అంతెందుకు..! జిల్లా కలెక్టర్లే ఏమీ తెలియనట‌్లుండాల్సిన పరిస్థితి. ఏలూరు, కృష్ణా జిల్లా పరిధిలోని కొల్లేరు అభయారణ్యంలో దాదాపు 12 చోట్ల అటవీ చెక్ పోస్టులున్నాయి. పొక్లెయినర్లు, చెరువులు తవ్వే ఇతర యంత్రాలు అర్ధరాత్రి ఈ మార్గాల నుంచే వెళ్తాయి. దర్జాగా తవ్వేస్తుంటాయి.

అనేక నిర్మాణాలు.. అసలు కొల్లేరు అక్రమాలకు రాచబాట పరుస్తోంది... ప్రభుత్వ శాఖలే. ఆర్‌ అండ్‌బీ శాఖైతే ఏకంగా అక్రమ చేపల చెరువులకు సీడ్, ఫీడ్ తరలించేందుకు అనువుగా రహదారులు నిర్మిస్తోంది. ఏకంగా ఆరు, ఎనిమిది టైర్ల వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్లు వెడల్పు చేస్తోంది. ఇక్కడున్న ప్రజల రాకపోకల కోసమే నిర్మాణాలని అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేసినా చట్ట ప్రకారం ఇక్కడ నిర్మించాల్సింది కచ్చారోడ్లే. కానీ ఆర్ అండ్‌ బీ శాఖ ఏకంగా కంకర, తారు రోడ్లు వేస్తోంది. అసలు వీటినికి అనుమతులు ఎవరిచ్చారంటే సమాధానమే ఉండదు. విద్యుత్ శాఖ కూడా అక్రమాలకు తన వంతుగా.. వెడల్పు చేసిన రహదారుల వెంట స్తంభాలు వేస్తోంది. ఇక కొల్లేరు కాంటూరు పరిధిలోని పైడిచింతపాడులో హౌసింగ్‌ శాఖ ఏకంగా జగనన్న ఇళ్ల లేఔట్‌ వేసేసింది. కొల్లేరును పూడ్చి నిర్మాణాలూ చేస్తుండడం విధ్వంసానికి పరాకాష్ట.

అభయారణ్యంలో అడుగు పెట్టాలంటే.. అసలు కొల్లేరుపై పెత్తనమంతా చేపల చెరువుల మాఫియాదే. వైఎస్సార్సీపీ సొంత సొత్తులా మార్చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరైనా కొల్లేరు అభయారణ్యంలోకి అడుగుపెడితే.. బయటకు వెళ్లేవరకూ ఏదో తెలియని నీడ వెంటాడి తరిమినంత భయోత్పాతం సృష్టిస్తారు. కొత్త వ్యక్తులుగానీ, వాహనాలుగానీ ప్రవేశిస్తే.. సెల్‌ఫోన్లో ఫొటోలు తీస్తారు. వాటిని చేపల చెరువుల మాఫియాకు, స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరులకు పంపుతారు. ఇందుకోసం కొన్ని ముఠాలే పనిచేస్తుంటాయి. కొల్లేరు కబ్జాపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన.. ఈటీవీ-ఈనాడు బృందాన్నీ మాఫియా మనుషులు వెంటాడారు. పైడిచింతపాడులో ఈటీవీ బృందం చెరువుల్ని చిత్రీకరిస్తోందంటూ ఏకంగా మైక్​లోనే పబ్లిక్​గా అనౌన్స్‌ చేశారు. బయటకు వచ్చి అడ్డుకోవాలంటూ ఊర్లో అందరికీ తెలిసేలా హెచ్చరించారు. అసలు మనదేశంలోనే ఉన్నామా పరాయి దేశంలో ఉన్నామా..! అని సందేహించేంత పరిస్థితులు కల్పించారు. దీనికి కారణం కొల్లేరు కబ్జాకు రాష్ట్రస్థాయి పెద్దల అండదండలే. కొల్లేరు ప్రధాన ఆక్రమణదారులు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులే. ఇక్కడ అక్రమ తవ్వకాలతో సంబంధముండే కీలక వ్యక్తులు సాక్షాత్తూ రాష్ట్ర స్థాయిలోని ముఖ్య కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదిస్తుంటారని సమాచారం. కొల్లేరులో కీలకంగా ఉంటూ.. కొత్త పాత్ర అందుకున్న ఒక నాయకుడు ముఖ్యకార్యాలయానికి వరుస చక్కర్లు కొడుతూ అక్రమ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ పొందినట్టు చర్చజరుగుతోంది. ఈ అక్రమ దందాకు మంచినీటి చెరువుల తవ్వకాల ముసుగుతొడిగారు.

వేల కోట్ల విలువైన భూముల అపహరణ... కొన్నేళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో కొల్లేరులో 15 వేల ఎకరాలు చేపల చెరువుల్లా మార్చేశారు. 2006లో అక్రమ చెరువుల్ని ధ్వంసం చేసి ఐదో కాంటూరు వరకూ 83వేల382 ఎకరాల మేర కొల్లేరు సరస్సును పునరుద్ధరించారు. అందులో 2021 అక్టోబరు 31 నాటికి 15,742 ఎకరాలు ఆక్రమణకు గురైందని అప్పటి కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదించారు. 2021-22లో మరో 3వేల ఎకరాల్లో అక్రమ చెరువులు తవ్వారని స్వయంగా అధికార యంత్రాంగమే అంగీకరిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇప్పటికి కొల్లేరులో 18వేల ఎకరాలను మాఫియా చెరబట్టినట్లు.. స్పష్టమవుతోంది. కొల్లేరు పరిధిలో ఎకరం పట్టా భూముల్లోని చెరువు విలువ కనీసంగా 60 లక్షల రూపాయలు. ఆ లెక్కల ప్రకారమే ఆక్రమణలకు గురైన భూముల విలువ 10,800 కోట్లుగా ఉంటుందని అంచనా.

అడ్డూ, అదుపు లేకుండా.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లెలో 66 ఎకరాల మేర చెరువు తవ్వేశారు. వడ్లకూటి తిప్ప, శృంగవరప్పాడు, ఇలా ప్రతీ గ్రామంలోనూ వందల ఎకరాల్లో తవ్వకాలు అడ్డూ అదుపులేకుండా జరిగిపోతున్నాయి. ములుగులూరులో.. మరో వందెకరాలకుపైగా చెరువులుగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. కైకలూరు- ఏలూరు ప్రధాన రహదారి ఆనుకుని కూడా అక్రమ చెరువులు తవ్వేస్తున్నారు. ఆకివీడు మండలం సిద్ధాపురంలో వందెకరాల్లో చెరువులు తవ్వేశారు. ఏలూరు రూరల్ మండలం పత్తికోళ్లలంక, పైడిచింతపాడులో దాదాపు 400ఎకరాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. ఈ తవ్వకాలు ఎవరూ అడ్డుకోకుండా ముందుగానే రహదారులపై ట్రాక్టర్లు పెట్టి, మనుషులు కాపలా ఉంటారు. అక్రమ తవ్వకాలు బాహ్య ప్రంచానికి తెలియనివ్వకుండా చూసుకుంటుంటారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.