MLA Nimmala Ramanaidu Done Sanitation Works: పేద ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట తప్పి వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసనకు దిగారు. ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని చేయడం లేదని.. పాలకొల్లులో పారిశుద్ధ్య పనులను నిర్వహించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి.. పంపిణీ చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మోసం చేశారని నిమ్మల ఆరోపించారు.
పాలకొల్లులో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వీధివీధి తిరుగుతూ చెత్తను ట్రాక్టర్లలో ఎత్తిపోశారు. దీని ద్వారా ఆయన జగన్ మోసపూరిత వైఖరిని పట్టణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహంతో ఉన్నారని.. ఆ ఆగ్రహంలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయమని దుయ్యబట్టారు.
పేదల సొంతింటి కల నేరవేర్చాలని టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి.. 90 శాతం పూర్తి చేసిందని నిమ్మల గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో.. టిడ్కో ఇళ్లలో మిగిలిన ఆ 10 శాతం నిర్మాణాన్ని పూర్తి చేయలేదని విమర్శించారు. ఇలా నిర్మాణాలు పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పేద ప్రజలపై కక్ష సాధింపునకు దిగుతున్నారని మండిపడ్డారు. అందుకు నిరసనగానే పారిశుద్ధ్య పనులు చేసినట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులు మాత్రమే కాకుండా.. మురుగు నీటి కాలువలను శుభ్రం చేశారు. ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ పంచి నిరసన వ్యక్తం చేసినట్లు వివరించారు.
జగన్ మోహన్ రెడ్డి పాలనలో టిడ్కో ఇళ్లలో కేవలం మూడు రకాల పనులను మాత్రమే చేసినట్లు వివరించారు. ఆ పనులలో ఒకటోది.. క్వారంటైన్ శిభిరాలను ఏర్పాటు చేశారని.. రెండో రకం పనులు టీడీపీ ప్రభుత్వం ఇళ్లకు వేసిన రంగులు కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంగులు మార్చిందని.. మూడోది టిడ్కో ఇళ్లను లబ్దిదారుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసి.. ఆ డ్యాక్యుమెంట్లతో బ్యాంకుల్లో ప్రభుత్వం రుణాలు సేకరించిందని అన్నారు.
ప్రభుత్వం ఇలా సేకరించిన రుణాల వల్ల టిడ్కో ఇళ్ల లబ్దిదారులు రుణగ్రస్థులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడు పనులు కాకుండా టిడ్కో ఇళ్లకు చేసిందేమైనా ఉందా అని ప్రశ్నించారు. ఆరోజు ఉచితంగా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు పేదలను సీఎం మోసం చేస్తున్నారని నిలదీశారు. టిడ్కో ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం అరబస్తా సిమెంటు, ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదన్నారు. నివాసయోగ్యంగా లేని.. జనవాసలు లేని ప్రాంతల్లో సెంటు భూమి ఇళ్ల స్థలాలు ఇస్తే.. ఇళ్లు ఎలా నిర్మించుకుంటారని ప్రభుత్వాన్ని నిమ్మల ప్రశ్నించారు. అవి దాదాపు ముంపునకు గురి అవుతున్నాయని.. అందువల్ల లబ్దిదారులు అందులో ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారని అన్నారు.
Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు