Kidnapping incident in AP: ఏలూరు జిల్లాలోని కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిళ్ల గోళ్ల శ్రీలక్ష్మి భర్త సివిల్ ఇంజినీరు ఈడ్పుగంటి నవరాజును ఇద్దరు వ్యక్తులు కిడ్నాపు చేసేందుకు ప్రయత్నించారు. పని నిమిత్తం తన వద్దకు వచ్చిన ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితుడు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నవరాజు ఏలూరులోని డీమార్టు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం వద్ద ఉండగా మంగళవారం ఇద్దరు యువకులు అతని వద్దకు వచ్చి పని అడిగారని.. ఈ క్రమంలోనే అదే సమయంలో రోడ్డు ప్రక్కగా ఓ కారు వచ్చి ఆగటం ఆ ఇద్దరు యువకులు నవరాజును ఆ కారులోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం జరిగిందని తెలిపారు. ఊహించని ఈ పరిణామానికి అక్కడ "పనులు చేస్తున్న కూలీలు ఏం జరుగుతుందో తెలియక తొలుత ఆందోళన చెందారు. వెంటనే పరుగున అక్కడకు చేరుకుని యువకుల ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. విషయం జఠిలంగా మారటంతో ఆ యువకులిద్దరు నవరాజును వదిలి, కారులో పారిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి
- ఈనెల 11న ప్రధాని విశాఖ పర్యటన.. కార్యక్రమాలివే..
- ఎమ్మెల్యేల ఎర కేసు.. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు
- గ్రహణం సమయంలో ఈ రాశుల వాళ్లు ఈ మంత్రం పటిస్తే శుభకరం