ETV Bharat / state

అభివృద్ధి చేయాల్సిన పాలకుడు.. విధ్వంసం చేస్తున్నాడు: చంద్రబాబు - చంద్రబాబు ఆరోగ్య రహస్యం

CBN FIRES ON CM JAGAN : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన పాలకుడు.. విధ్వంసం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

CBN FIRES ON CM JAGAN
CBN FIRES ON CM JAGAN
author img

By

Published : Nov 30, 2022, 7:19 PM IST

CBN FIRES ON CM JAGAN : ప్రజలను మోసం చేసి జగన్‌ అధికారంలోకి వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మీ తర్వాత మిగతా వారి భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి చేయాల్సిన పాలకుడు విధ్వంసం చేస్తున్నాడని మండిపడ్డారు. భవిష్యత్తు తరాల పరిస్థితిపై విద్యార్థులు ఆలోచించాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుంటారో లేక బలిపశువులవుతారో మీ చేతుల్లోనే ఉందని ప్రశ్నించగా.. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం కానీ బలిపశువులు కాబోమని విద్యార్థులు నినాదాలు చేశారు.

ముఖాముఖిలో విద్యార్థుల ప్రశ్నలు.. చంద్రబాబు సమాధానాలు

విద్యార్థి ప్రశ్న: మీ ఆరోగ్య రహస్యం ఏంటి?

చంద్రబాబు సమాధానం: మన మైండ్‌ను నియంత్రిస్తూ ఇష్టపడి పని చేయాలి. ఏం తినాలో? ఎంత తినాలో? జాగ్రత్తలు తీసుకోవాలి.

విద్యార్థి ప్రశ్న: పారిశ్రామికాభివృద్ధి, సాగులో ఏది ముఖ్యం?

చంద్రబాబు సమాధానం: నాలెడ్జ్ ఎకానమీ అన్నింటి కంటే ముఖ్యమైనదన్న చంద్రబాబు.. వ్యవసాయం లేనిదే ఆహారం ఉండదన్నారు. పరిశ్రమలు లేకుంటే ఏ వస్తువులూ ఉండవని.. రెండు రంగాలను నాలెడ్జ్ ఎకానమీతో అభివృద్ధి చేయొచ్చన్నారు.

విద్యార్థి ప్రశ్న: బోధనా రుసుము అందక ఇబ్బంది పడుతున్నాం.

చంద్రబాబు సమాధానం: విద్యార్థుల చదువులకు దోహదపడే చర్యలు తీసుకుంటాం.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.