ETV Bharat / state

'టీడీపీపై ప్రేమ ఉంటే ఏపీలో ఎన్టీఆర్‌ను సీఎం చేయండి' - చంద్రబాబుపై ఎర్రబెల్లి ఫైర్

TS Ministers comments on Chandrababu: తెలంగాణలోని ఖమ్మం సభలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు టీడీపీపై ప్రేమ ఉంటే ఏపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైటెక్‌సిటీలో ఒక భవనం కట్టి అంతా తానే చేశానని కోతలు కోస్తున్నారని సబితారెడ్డి ధ్వజమెత్తారు.

TS Ministers comments on Chandrababu
TS Ministers comments on Chandrababu
author img

By

Published : Dec 23, 2022, 11:53 AM IST

Ministers comments on Chandrababu: చంద్రబాబుకు టీడీపీపై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పార్టీల్లో చేరిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి రావాలని ఖమ్మం సభలో చంద్రబాబు పిలుపు ఇచ్చారని ఓ విలేకరి ప్రస్తావించగా మంత్రి స్పందించారు.

'అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదు. ఎన్టీఆర్‌ది. చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్‌ ఏపీలో సీఎం కావాలనుకుంటున్నారు. కానీ ప్రజలు జూనియర్‌ ఎన్టీఆర్‌ను కోరుకుంటున్నారు. చంద్రబాబుకు తెదేపాపై ప్రేమ ఉంటే ఎన్టీఆర్‌ను అక్కడ ముఖ్యమంత్రిని చేయాలి.'-ఎర్రబెల్లి దయాకర్​రావు,తెలంగాణ పంచాయతీరాజ్​ శాఖ మంత్రి

చంద్రబాబు దిగిపోయేనాటికి హైటెక్‌సిటీ దగ్గర మంచి నీళ్లకూ దిక్కులేదు: చంద్రబాబు హైటెక్‌సిటీలో ఒక భవనం కట్టి అంతా తానే చేశానని కోతలు కోస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆయన సీఎంగా దిగిపోయేనాటికి హైటెక్‌సిటీ దగ్గర మంచి నీళ్లకూ దిక్కులేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారానే రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తోందని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. గురువారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

'చంద్రబాబు భాజపాకు దగ్గర కావాలనే ఇప్పుడు మళ్లీ తెలంగాణ అంటున్నారు. మోదీ దర్శకత్వంలో తిరుగుతున్నారు. కరోనా సమయంలో తెలంగాణలోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదు' అని సబితారెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌లలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి వెంట ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.