SOMU FIRES ON CM AND CHANDRABABU : పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తే.. ఇప్పటికైనా కట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భాజపా ప్రజాపోరు యాత్రలో భాగంగా ఏలూరు చేరుకున్న ఆయన.. తెలుగుదేశం, వైకాపాలపై మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సొంతపేర్లు పెట్టుకున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థలకు ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అంటూ సవాల్ విసిరారు.
రాష్ట్రంలో మద్యం, భూ, ఎర్ర చందనం, ఇసుక మాఫియా పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సులభంగా బంగారమైనా దొరుకుతుంది కానీ.. ఇసుక మాత్రం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, గ్రామాల అభివృద్ధి విషయంలో చంద్రబాబు, జగన్ జీరోలని.. మోదీని హీరో అని అభివర్ణించారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో సర్పంచులకు నిధులు విడుదల చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: