ETV Bharat / state

'ముగ్గు వేస్తుండగా దూసుకొచ్చిన లారీ' చెల్లి మృతి, అక్కకు తీవ్రగాయాలు - మరో రెండు ప్రమాదాల్లో ఐదుగురు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2024, 3:58 PM IST

6 People Killed In Separate Accidents: రాష్ట్రంలో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఇంటి ముందు ముగ్గులు వేస్తుండగా లారీ ఢీకొని ఓ యువతి మృతి చెందింది. పెట్రోల్ కోసం వెళ్లి వస్తుండగా బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యవకులు, తిరుపతి జిల్లాలో డివైడర్​ను బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యవకులు ప్రాణాలు కోల్పోయారు.

6 People Killed In Separate Accidents
6 People Killed In Separate Accidents

6 People Killed In Separate Accidents: ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో సంక్రాంతి పండుగ ఆ ఇంట్లో చీకట్లు నింపింది. సంక్రాంతికి ఇంటిముందు ముగ్గులు వేస్తుండగా, అక్కాచెల్లెళ్ల మీదికి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రామాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పంగిళ్ల నాగబాబు ఇద్దరు కుమార్తెలు తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అదే సమయంలో కైకలూరు వైపు వెళ్తున్న ఇటుకల లారీ వారిద్దరిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో తేజస్విని (16) మృతి చెందగా, పల్లవీ దుర్గకు (18) తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారు గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దుర్గకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను ప్రకాశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేజస్విని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తేజస్విని, పల్లవీ దుర్గ ఇంటర్‌ చదువుతున్నారు.
ట్రాక్టర్​ను ఢీకొట్టిన కారు - ఇద్దరు మృతి 'బస్సుకింద పడి మరొకరు'

పెట్రోల్ కోసం వెళ్లి ఇద్దరు మృతి: కృష్ణాజిల్లా కురుమద్దాలిలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పామర్రు మండలం కురుమద్దాలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తానేటి హరీష్, పంది గోవింద్ మృతి చెందారు. పెట్రోల్ బంక్ నుంచి బైక్ కు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. యువకుల మరణ వార్త విని కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టిన బైక్ తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కలగుంట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యవకులు మృతి చెందారు. మృతి చెందిన యువకులు నిన్న రాత్రి నాయుడుపేటలో భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బైక్ పై పాండిచ్చేరి వెళ్లేందుకు బయల్దేరారు. మార్గం మధ్యంలో బైక్ అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటన ప్రదేశంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న తమ బిడ్డలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో బస్సు బోల్తా పడి చెలరేగిన మంటలు - మహిళ సజీవదహనం, పలువురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.