ETV Bharat / state

కెనడాలో స్నేహితుడిని కాపాడి... తాను ప్రాణాలు వదిలాడు - కెనడాలో ఏలేశ్వరం యువకుడు మృతి

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన యువకుడు కెనడాలో మృతి చెందాడు.బుధవారం స్నేహితులుతో కలిసి గ్రామానికి చెందిన తేజశ్రీరెడ్డి కెనడాలో జలాశయంలో స్నానానికని వెళ్లారు. స్నేహితుడు నీటమునుగుతుంటే కాపాడబోయి తాను మరణించాడు. చేతికందిన కుమారుడు మృతిచెందటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

youngster belonged to eleshwaram of east godavari died at canada
ఏలేశ్వరం గ్రామానికి చెందిన యువకుడు కెనడాలో మృతి
author img

By

Published : Jul 30, 2020, 3:18 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన యువకుడు కెనడాలో మృతి చెందాడు. కెనడాలో ఎంఎస్ పూర్తి చేసిన... శ్రీనివాస తేజశ్రీ రెడ్డి మూడేళ్లుగా అక్కడే నివసిస్తున్నాడు. బుధవారం స్నేహితులుతో కలిసి జలాశయంలో స్నానానికని వెళ్లారు. అయితే తన స్నేహితుడు స్నానం చేస్తుండగా మునిగిపోతుంజటాన్ని గమనించిన తేజ...స్నేహితుడిని కాపాడి తాాను నీటమునిగి మృతి చెందాడు. మూడు సంవత్సరాల నుంచి చదువు, ఉద్యోగం నిమిత్తం కెనడాలో ఉన్న తేజ...వారం రోజుల్లో ఉద్యోగంలో చేరనుండగా ఈ ప్రమాదం జరిగింది. తమ కుమారుడు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని భావించిన తేజశ్రీరెడ్డి... అర్ధాంతరంగా కన్ను మూయడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి;

పైడికొండలో వైరస్ ఉద్ధృతి.. ఇప్పటివరకూ 51 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.