విద్యుత్ వైర్లు తగిలి యువకుడు మృతి చెందడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన ఎల్లారావు పొలానికి వెళ్ళాడు. రాత్రి అయిన తిరిగి రాకపోవడం.. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందినట్లు గుర్తించారు. మేకకు మేత కోసం వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పొలంలో విద్యుత్ వైర్లు కిందకు వేళాడుతుండడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకోందని గ్రామస్థులు మృతదేహంతో పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు చేపట్టారు. మృతుని కుటుంబానికి ట్రాన్స్ కో వారు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...