తూర్పు గోదావరి జిల్లా కె.గంగవరం మండలం కుడుపూరు గ్రామంలో కోడి పందాల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ముగ్గురు పందెం రాయుళ్లు కాలువలోకి దూకేశారు. వీరిలో ఆకుల రమేశ్ (25) అనే యువకునికి ఈత రాకపోవడంతో మురుగు కాలువలో మునిగిపోయాడు. పోలీసులు వెంటనే నాటుపడవలపై గాలించగా.. అతని మృతిదేహం లభించింది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే... మృతుని కుటుంబ సభ్యులు అడ్డుకొని ధర్నా చేపట్టారు. పోలీసులు తరమటం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని.. రమేశ్ తండ్రి ఆరోపించాడు. తమకు న్యాయం జరిగే వరకు కదలబోమని నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, ఇన్చార్జ్ సీఐ భాస్కర రావు ఆందోళనకారులతో చర్చలు జరిపటంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: