వైకాపా నాయకుల పిరికిపంద దాడులు, రౌడీయిజానికి భయపడే ప్రసక్తే లేదని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలో భాజపా నాయకునిపై వైకాపా నేతల దౌర్జన్యాన్ని ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన అప్పికొండ జోగిబాబుపై వైకాపా నాయకులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. గతంలోనూ ఈ తరహా దాడులు జరిగాయని గుర్తు చేశారు. వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని.. అధికారం శాశ్వతం కాదన్న నగ్నసత్యాన్ని వాళ్లు గ్రహించాలన్నారు.
తన సొంత మండలంలో జరుగుతున్న దాడులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ బాధ్యత వహించాలన్నారు. ఈ దాడికి కారకులైనా వాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా ఎస్పీని కోరారు.
ఇదీ చూడండి: