తూర్పుగోదావరి జిల్లా పక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలోకి ఇతరులను రానివ్వకపోవడం వివాదాలకు దారితీస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్నందున అధికారులు కొన్ని జోన్లలో నిబంధనలను సడలించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాకపోకలకు అనుమతిచ్చారు.
పుదుచ్చేరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం యానాంలోకి ఇతర ప్రాంతాల వారిని అనుమతించకూడదన్న ఆదేశాలతో... ఇతర ప్రాంతాల వారిని సరిహద్దు వద్దే నిలిపివేస్తున్నారు. మద్యం దుకాణాలు తెరిచినా అందులో పనిచేసే సిబ్బంది అంతా బయటి ప్రాంతాల వారే కావడం.. వారిని లోపలకు అనుమతించకపోవడం.. కొనేందుకు బయటి నుంచి ఎవరూ రాకపోవడంతో ఉపయోగం లేకుండా పోయిందని వ్యాపారులు వాపోయారు.
ఇదీచదవండి.