పశ్చిమ గోదావరి జిల్లాలో గృహిణి అనుమానస్పద స్థితిలో మరణించింది. ద్వారకా తిరుమలకు చెందిన కొత్త గుళ్ల లక్ష్మణ రావుకు ఏలూరుకు చెందిన రేణుకతో 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ... వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారు. కాసేపటికి లక్ష్మణరావు బయటికి వెళ్లిపోయాడు.
ఇంట్లో ఏ అలికిడి లేకపోవడం.. ఎంత పిలిచినా రేణుక స్పందించకపోవడంపై అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు.. లక్ష్మణరావుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఆయన ఇంటికి వెళ్లి చూసే సరికి ఉరి వేసుకున్న స్థితిలో.. రేణుక విగతజీవిగా ఉంది. వెంటనే జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్సై దుర్గామల్లేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి: