తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వై. కొత్తపల్లి గ్రామంలోని గోదావరిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యం చేసుకుంది. 24 ఏళ్ల కుడుపూడి రోహిణి కుమారి వెంకటేశ్వరరావును ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. మూడేళ్ల నుంచి తరచూ గొడవలు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన వేధింపులు ఎక్కువైనందునే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని రోహిణి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి. ఇంట్లోనే రంజాన్ వేడుకులు