తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప ప్రయత్నించారని మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ కోడలు మంజుప్రియ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు రాధాకృష్ణతో తొమ్మిదేళ్ల కిందట వివాహ జరిగిందని... ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆమె చెప్పారు. గత కొంతకాలంగా కాపురానికి రాకుండా వేధించటంతో మార్చి 10న ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో అత్తమామలపై ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తొండంగి మండలం ఏవీనగరంలో తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్లు ఆమె చెప్పారు.
యనమల, చినరాజప్పపై మహిళ ఫిర్యాదు - complaint on tdp former ministers
మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పపై మంజుప్రియ అనే మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు రాధాకృష్ణతో తనకు తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగిందని... ఇప్పుడు తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి మాజీ మంత్రులు ప్రయత్నించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప ప్రయత్నించారని మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ కోడలు మంజుప్రియ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు రాధాకృష్ణతో తొమ్మిదేళ్ల కిందట వివాహ జరిగిందని... ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆమె చెప్పారు. గత కొంతకాలంగా కాపురానికి రాకుండా వేధించటంతో మార్చి 10న ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో అత్తమామలపై ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తొండంగి మండలం ఏవీనగరంలో తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్లు ఆమె చెప్పారు.
ఇదీ చూడండి: రూ.2 కోట్లతో సత్య నాదెళ్ల కుటుంబం ప్రణాళిక