తూర్పుగోదావరి జిల్లా తునిలో మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతు బజార్‌ను దాడిశెట్టి రాజా ప్రారంభించారు. లాక్‌డౌన్‌తో ప్రజల విద్యుత్ వినియోగం పెరిగిందని.. దీనివల్లే.. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అంతేగానీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని రాజా ఆరోపించారు.
ఇదీ చదవండి: 'వ్యవసాయ కార్యకలాపాలకు ఇబ్బంది కలగొద్దు'