తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడివరం ప్రభుత్వ పాఠశాలలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సందర్భంలో ఎలా స్పందించాలి అనే విషయం వివరించారు. తక్షణం ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఏ విధంగా స్పందించాలి అన్న విషయాలను చెప్పారు.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సిబ్బంది మంటలను ఏ విధంగా అదుపు చేస్తారు...బాధితులను ఎలా రక్షిస్తారు అన్నది.. మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. తుపానులు, వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో సాహసోపేతంగా సిబ్బంది చేసే రక్షణ చర్యలను వివరించారు.
ఇదీ చదవండి: