కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. శుక్రవారం నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
యానాంలో నిత్యావసర దుకాణాలు, మందుల షాపులు మినహా అన్ని దుకాణాలను మూసివేశారు. అత్యవసర వైద్యం, బ్యాంకు లావాదేవీలకు మాత్రమే సాధారణ ప్రజలను రోడ్లపైకి అనుమతిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ హెచ్చరించారు.
ఇదీ చదవండి: