తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాలలతో భిక్షాటన చేయించడం నిషేధమనే అంశంపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాధవ రెడ్డి చిన్నారులతో భిక్షాటన చేయిస్తే శిక్షార్హులు అంటూ ముద్రించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం పలు వాహనాలను ఆపి వాటికి అతికించారు.
కఠిన చర్యలే..
కాపు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలతో ఏవరైన భిక్షాటన చేయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మాధవ రెడ్డి హెచ్చరించారు.