యానాంలో జరగనున్న శాసనసభ ఎన్నికలో నూరు శాతం ఓటింగ్ జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచార ప్రణాళికలు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 'లెట్స్ ఓట్'.. అనే విధానంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువత, ఇతర ప్రముఖులతో సంతకాల సేకరణ వాహనాన్ని యానాం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ ప్రారంభించారు.
నియోజకవర్గ పరిధిలోని 10 రెవెన్యూ డివిజన్లలో ఈ వాహనం ద్వారా ఓటు విలువ, దానిని వినియోగించడం ద్వారా సమర్థులైన నాయకులను ఎన్నుకోవడం వంటి విషయాలను ప్రచారం చేస్తున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గానికి మూడవ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెమ్మాడి దుర్గాప్రసాద్ ఒక్కరే రిటర్నింగ్ అధికారికి నామపత్రాలను సమర్పించారు.
ఇదీ చదవండి: