చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లన వారికి కరోనా పాజిటివ్ రావడంతో చిత్తూరు జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సత్యవేడు, పలమనేరు, నగరి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాలపై అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన 21 మందిని గుర్తించారు. వారిలో ఏడుగురి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్న వి.కోట మార్కెట్‌ను మూసివేస్తున్నామని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రకటించారు. కోయంబేడుకు వెళ్లివచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇదకీచదవండి.