కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులను అనుమతించవద్దని వాడపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పేరుపొందిన గుడి కనుక ఎక్కడెక్కడినుంచో ప్రజలు వస్తుంటారని.. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి అధికమవుతుందంటూ వారు భయాందోళన వ్యక్తం చేశారు. గ్రామం మధ్యలో ఆలయం ఉండడం వలన మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం మరికొన్ని రోజులు దర్శనాలు నిలిపివేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి.. చంద్రగిరిలోని దేవాలయాల్లో దర్శనాలు ప్రారంభం