
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన కవి, రచయిత ఎంఎస్ సూర్యనారాయణకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేఖ రాశారు. సూర్యనారాయణ.. 15 రోజుల కిందట తాను రాసిన పలు పుస్తకాలను ఉపరాష్ట్రపతికి పంపించారు. వాటికి స్పందనగా.. ఉపరాష్ట్రపతి లేఖను పంపించారు.
పండితారాధ్యులు సాంబమూర్తి జీవన దర్శనాన్ని వివరించిన 'హరికథ భిక్షువు', స్వాతంత్ర సమరయోధుడు, నరసాపురం తొలి ఎమ్మెల్యే అల్లూరి సత్యనారాయణరాజు జీవిత చరిత్ర 'సత్యపథం', స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ సతీసమేతంగా రాజోలులో పర్యటించి రెండు రోజులు స్థానికంగా పొన్నాడ సూర్యారావు ఇంట్లో బస చేసిన చరిత్రను తెలియజేస్తూ రాసిన 'రాజోలులో గాంధీ హౌస్', శబ్దభేది లాంటి పుస్తకాలను సూర్యనారాయణ.. ఉపరాష్ట్రపతికి పంపించారు. అవి అందుకున్న వెంకయ్య.. రచనలు బాగున్నాయని అభినందిస్తూ లేఖను రాశారు.
school timings : పాఠశాలల పనివేళలు పెంపు... విద్యా సంవత్సరంలో 188 పని దినాలు