తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో కూరగాయలు పంపిణీ చేశారు. మండల సర్పంచుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు కన్నబాబు ఆధ్వర్యంలో సుమారు 6 టన్నుల కూరగాయలు వెయ్యి కుటుంబాలకు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉదేశంతో ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు, 30 కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ చేసినట్లు కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మండిగ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. సత్యగోపీనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ