తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన న్యాయవాది పైలా సుభాష్ చంద్రబోస్ అరెస్టు దారుణమని ప్రత్తిపాడు తెదేపా ఇన్ఛార్జ్ వరుపుల రాజా అన్నారు. ఆడవాళ్లు, చిన్నపిల్లలను భయబ్రాంతులకు గురిచేస్తూ.. అర్ధరాత్రి ఒక న్యాయవాదిని అరెస్టు చేయటం ఘోరమన్నారు.
న్యాయవాది కుటుంసభ్యులను వరుపుల రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బోసును ఎందుకు అరెస్టు చేశారో... ఎక్కడ దాచారో ఇంతవరకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబోసును వెంటనే కోర్టులు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడైన బోసును.. నియోజకవర్గంలో బీసీ నాయకులను ప్రత్తిపాడు పోలీసులు పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే తీవ్ర స్థాయిలో స్పందిస్తామని హెచ్చరించారు. బోసు కుటుంబానికి చంద్రబాబు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు