అన్నపూర్ణదేవీగా వనదుర్గ, కనకదుర్గలు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం క్షేత్ర రక్షకులుగా పిలవబడే వనదుర్గ, కనకదుర్గలను అన్నపూర్ణదేవీగా అలంకరించారు. దసరా మహోత్సవాల్లో భాగంగా రోజుకొక అలంకారం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దసరా మహోత్సవాల్లో సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిచ్చిన వనదుర్గ, కనకదుర్గలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావటంతో ఆలయం కిటకిటలాడింది.
ఇదీ చదవండి : బాలా త్రిపుర సుందరి దర్శనానికి భక్తుల బారులు