ETV Bharat / state

కోనసీమ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఆరంభం

author img

By

Published : Oct 17, 2019, 7:53 PM IST

కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లి శ్రీవెంకంటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తమైన పద్ధతుల్లో వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు.

కోనసీమ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఆరంభం
కోనసీమ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఆరంభం
తూర్పుగోదావరి జిల్లాలో గౌతమీ నది తీరాన ఉన్న కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మూలవిరాట్​ విగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అగ్ని ప్రతిష్టాపన, విశేష అర్చన, నీరాజనము వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల ప్రత్యేక పూలతో అందంగా ముస్తాబుచేశారు. స్వామివారిని దర్శించుకోడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వాడపల్లి తరలివస్తున్నారు.

ఇదీ చదవండి :

వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Intro:AP_RJY_56_17_BRAHMOTSAVALU_PRAARAMBAM_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరి జిల్లాలోని గౌతమీ నది తీరాన ఉన్న కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి

Body:శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అగ్ని ప్రతిష్టాపన, విశేష అర్చన, నీరాజనము దగ్గర ప్రత్యేక పూజలను స్వామివారికి నిర్వహించారు.

Conclusion:బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల ప్రత్యేక పూలతో అందంగా ముస్తాబు చేశారు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.