ETV Bharat / state

కొవిడ్‌ వైద్యశాలల్లో నిండిన పడకలు.. అనుమతుల్లేని ఆసుపత్రులే శరణ్యం

author img

By

Published : May 16, 2021, 12:57 PM IST

కొవిడ్‌ కేసులు వేలల్లో నమోదవుతుండగా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం కొన్ని వైద్యశాలలకు మాత్రమే కొవిడ్‌ అనుమతులు ఇవ్వడం... వాటిలో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు నిండి సమస్య ఎదురవుతోంది. గత్యంతరం లేక కొందరు అనుమతులు లేని ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. వెరసి రోగుల తాకిడి, అవసరాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

hospitals
అనుమతి లేకుండా ఆస్పత్రుల్లో కొవిడ్​ చికిత్స

రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనుమతి లేకుండా కొవిడ్‌ చికిత్స నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాలని వారి బంధువులకు సూచించడంతో గందరగోళం నెలకొంది. తీరా ఆరా తీస్తే ఆక్సిజన్‌ సమకూర్చడంలో ఇబ్బందులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాజమహేంద్రవరంలో కొన్ని వైద్యశాలల్లో అనధికారిక వైద్యం సాగుతోంది. ఇటీవల తనిఖీ సమయంలో ఓ ఆసుపత్రికి కొవిడ్‌ అనుమతులు లేవని నిఘా అమలు విభాగం గుర్తించింది. ఆ తర్వాత సంబంధిత వైద్యశాల కొవిడ్‌ అధికారిక అనుమతులు పొందడం గమనార్హం.

కాకినాడ రామారావుపేటలో ఓ ప్రముఖ ఆసుపత్రిని విజిలెన్స్‌ బృందం గురువారం తనిఖీ చేసింది. ఈ ఆసుపత్రికి కొవిడ్‌ చికిత్సకు ఎలాంటి అనుమతులు లేకపోయినా 18 మంది కరోనా బాధితులకు అనధికారికంగా వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆసుపత్రిపై రెండో పట్టణ పోలీసుల స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కొవిడ్‌ ప్రమాణాలు పాటించకుండా, వనరులు సమకూర్చుకోకుండా వైద్యం చేయడంతో సమస్య తప్పడం లేదు. అనధికార వైద్యం అందించే క్రమంలో ఆక్సిజన్‌ కొరత, అత్యవసర ఇంజక్షన్లు అవసరమైన వేళల్లో దొరక్క చేతులెత్తేస్తున్నారు. రోగుల కుటుంబాలపైనే భారం మోపి ఆయా వనరులు సమకూరిస్తేనే సేవలు కొనసాగిస్తామని, లేదంటే రోగిని తీసుకెళ్లండని తేల్చి చెప్పేస్తున్నారు. అనధికార తీరు జోరు మీదున్నా అధికారుల మొక్కుబడి తనిఖీలు... నామమాత్ర చర్యలే కనిపిస్తున్న దయనీయమిది.

కఠిన వైఖరి లేకనే..

తూర్పున కొవిడ్‌ సేవలకు కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి సహా... 73 ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అతిక్రమణలు కారణాలుగా చూపి కొన్నింటి అనుమతి రద్దు చేశారు. ప్రస్తుతం 54 చోట్లనే కొవిడ్‌ సేవలు అధికారికంగా అందుతున్నాయి.

రెండో దశ కొవిడ్‌ కేసులు పెరగడంతో ఆసుపత్రుల్లో పడకలకు గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు సొమ్ము చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో జిల్లాలోని ఐఏఎస్‌, ఇతర డివిజన్‌ స్థాయి అధికారులతో ఆసుపత్రుల్లో తనిఖీలకు కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. ఔషధ నియంత్రణ, వైద్యారోగ్యశాఖ, నిఘా- అమలు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బృందాలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాకినాడ, రాజమహేంద్రవరంలలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వ్యవహారంపై కొన్ని చర్యలు తీసుకున్నారు. అనుమతులకు మించి పడకలతో వైద్యం అందిస్తున్న ఆసుపత్రులు, అనుమతిలేని ఆసుపత్రులపైనా చర్యలు చేపట్టారు. డబ్బు కడితేనే ఆరోగ్యశ్రీ, ఇతర పథకాలకు అర్హత ఉన్న కేసులను చేర్చుకోవడం, అధిక రుసుముల వసూళ్లను గుర్తించారు. తాజాగా 39 ఆసుపత్రులపై చర్యల్లో భాగంగా రూ.1.54 కోట్లు అపరాధ రుసుము విధించారు. విజిలెన్స్‌ విభాగం మరికొన్ని ఆసుపత్రుల్లో లోపాలు గుర్తించి చర్యలకు ఉపక్రమించింది.

కీలక వేళ.. కాసుల వేట..

ప్రాణాంతక మహమ్మారితో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అడిగినంత డిపాజిట్‌ చేస్తేనే (రూ.లక్షకు తక్కువ కాకుండా) మంచం కేటాయిస్తున్నారు. డిశ్ఛార్జి సమయంలోనూ భారీ మొత్తం చెల్లించాల్సిందే. పడకల నుంచి కీలకమైన రెమ్‌డెసివిర్‌, టుసిలిజుమ్యాబ్‌ ఇంజక్షన్లు.. ప్రాణవాయువు అందించే విషయంలోనూ అవకాశం ఉన్నంత వరకు గుంజుతున్నారు. మరికొందరు రూ.లక్షలు వెచ్చించి ప్రైవేటుగా కొనే పరిస్థితీ ఉంది.

రాజమహేంద్రవరంలో కొవిడ్‌ అనుమతులు లేకుండా ఓ ఆసుపత్రి నడుస్తోంది. అక్కడ చేరిన ఓ కొవిడ్‌ రోగికి రెమ్‌డెసివిర్‌ అత్యవసరమైంది. మీరే తెచ్చుకోండని ఆసుపత్రి యాజమాన్యం రోగి బంధువులకే బాధ్యత వదిలేసింది. దీంతో ఇంజక్షన్‌ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి అధిక మొత్తం చెల్లించి ప్రైవేటుగా సమకూర్చుకున్నారు.మరో కేసులో సమయానికి ఇంజక్షను అందక రోగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది.

అనపర్తి మహిళ (60)కొవిడ్‌ బారిన పడ్డారు. రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి రూ.4 లక్షలకుపైనే ఖర్చుచేశారు. పరిస్థితి విషమించిన వేళ ఆక్సిజన్‌ సౌలభ్యం ఇబ్బందిగా ఉంది. మరో ఆసుపత్రికి తరలించాలని యాజమాన్యం తేల్చిచెప్పింది. అప్పటికే ఆర్థికంగా చితికిన ఆ కుటుంబం రోగిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ ఆ మహిళ ప్రాణాలు వదిలింది.

ప్రత్యేక బృందాలతో తనిఖీల పెంపు

ప్రభుత్వ, అనుమతి పొందిన ఆసుపత్రుల్లో పడకలు పూర్తిగా నిండి కొందరు అనుమతుల్లేని ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వాటిల్లో కొవిడ్‌ వైద్యం అందించే సామర్థ్యం ఉంటే అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి లేకుండా చికిత్స చేస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే కాకినాడ, బొమ్మూరు, బోడసకుర్రులో కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 6 వేల పడకలు ఉన్నాయి. అక్కడ అత్యవసర ట్రాన్‌సిస్ట్‌ వ్యవస్థ అందుబాటులో ఉంది. నేరుగా రోగిని అక్కడికి తీసుకెళ్లొచ్ఛు జీజీహెచ్‌, ఈఎస్‌ఐ ఇతర ప్రాంగణాల్లో అదనపు పడకలు సమకూర్చాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక వసూళ్లపై దృష్టిపెట్టాం. ఆసుపత్రుల్లో కోలుకుని ఇంటికి చేరినవారిని వాకబు చేస్తాం. వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా విచారణ జరిపి చర్యలు చేపడతాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశాం. - మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌

ఇదీ చదవండి:

కరోనా కష్టకాలంలో సాయి సేవా ట్రస్టు మానవతా స్ఫూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.