లేగదూడలపై గుర్తుతెలియని జంతువు దాడి చేసి చంపేస్తున్న ఘటనలపై.. పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం నవాబుపేటకు చెందిన గోపిరెడ్డి రాముడు.. పశువుల పాకకు ఉదయం వచ్చి చూసేసరికి లేగదూడ మృతిచెంది ఉంది. ఏదో జంతువు.. దూడ పొట్టను చీల్చి చంపేసిందని రైతు వాపోతున్నాడు.
జూన్, జూలై నెలల్లోనూ.. ఆలమూరు, జొన్నాడ, పెనికేరు ప్రాంతాల్లో ఈ తరహా సంఘటనలు జరిగాయి. ఇటీవల కపిలేశ్వరపురం, అంగర గ్రామాల్లో లేగదూడల మీద దాడి చేస్తున్న తోడేలును.. రైతులు పట్టుకుని చంపేసినట్లు చెబుతున్నారు. పెద్దపెద్ద కుక్కలు సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలిసిందని.. పశుసంవర్ధక శాఖ ఏడీ రామకృష్ణ తెలిపారు. రెండు మూడు కలిసి దాడిచేసి తింటున్నట్లు అనుమానిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టివేత