తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట బోడిపాలెం వంతెన సమీపంలో.. గోదావరి తోరగపాయ వద్దకు ఓ వృద్ధురాలి మృతదేహం కొట్టుకువచ్చింది. గోదావరికి వరద నీరు ఎక్కువగా రావటంతో.. బోడిపాలెం వంతెన వద్ద తోరగపాయ ఉద్ధృతంగా ప్రహిస్తోంది. ఈ ప్రవాహంలో ఎక్కడ నుంచి కొట్టుకువచ్చిందో సుమారు 70 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం వంతెన తుప్పలకు అడ్డుతగిలి ఉండిపోయింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ప్రసవం కోసం... కర్రల సాయంతో వాగు దాటించారు!