తూర్పుగోదావరి జిల్లా వైరామరం మండలం బొడ్డగండి గ్రామంలో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామంలో జేసీబీతో రహదారి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో జేసీబీ డ్రైవర్ సురేశ్, పక్కనే కూర్చున్న పండురెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. వీరిలో పండురెడ్డి మారేడుమిల్లి మండలం ఏటుకూరు గ్రామానికి చెందిన వాడు కాగా.. సురేశ్ గోకవరం గ్రామానికి చెందినవాడు.
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా బొడ్డగండి గ్రామంలో జరిగింది. రహదారి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా వైరామరం మండలం బొడ్డగండి గ్రామంలో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామంలో జేసీబీతో రహదారి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో జేసీబీ డ్రైవర్ సురేశ్, పక్కనే కూర్చున్న పండురెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. వీరిలో పండురెడ్డి మారేడుమిల్లి మండలం ఏటుకూరు గ్రామానికి చెందిన వాడు కాగా.. సురేశ్ గోకవరం గ్రామానికి చెందినవాడు.
ఇదీ చూడండి:ఖాళీ చెయ్యాలని ఖాకీ దెబ్బలు