ETV Bharat / state

తాగిన మత్తులో... గంగమ్మ విగ్రహాన్ని నీటిలో పడేశారట!

రౌతులపూడి మండలం మెరకచామవరం గ్రామం వద్ద గంగాదేవి విగ్రహాన్ని నీటిలో తోసేసిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తాగిన మత్తులోనే ఈ విధంగా ప్రవర్తించారని డీఎస్పీ వివరించారు.

author img

By

Published : Sep 29, 2020, 11:06 PM IST

Two Members Arrest in Statue Issue
గంగాదేవి విగ్రహాన్ని నీటిలో తోసేసిన ఘటనలో ఇద్దరు అరెస్టు

తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం మెరకచామవరం గ్రామం వద్ద గంగాదేవి విగ్రహాన్ని నీటిలో తోసేసిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 24న రాత్రి అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు నీటిలో తోసేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేశారు.

ఈ కేసులో తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన బొబ్బరాల అమర్ బాబు, పల్లపు చామవరం గ్రామానికి చెందిన పిట్టా శ్రీనును అరెస్ట్ చేశామన్నారు. వివాహితతో తనకు వచ్చిన వివాదం విషయంలో.. వివాహిత తరఫున మధ్యవర్తిగా వచ్చిన అచ్చిరాజుపై అమర్ బాబు కోపం పెంచుకున్నట్టు చెప్పారు. తన స్నేహితుడు శ్రీనుతో కలిపి మద్యం సేవించించిన సమయంలో అచ్చిరాజు ప్రతిష్టించిన విగ్రహాన్ని తోసేసాడని పోలీసులు తెలిపారు. తాగిన మత్తులోనే ఈ విధంగా ప్రవర్తించారని డీఎస్పీ వివరించారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.