రెండున్నర దశాబ్దాలకుపైగా పాత్రికేయుడిగా సేవలందించిన.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఓ విలేకరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా.. అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
ఈరోజు పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రభతో సహా వివిధ దినపత్రికల్లో ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, ఏపీ పీయూసీ ఛైర్మన్ చిర్ల జగ్గిరెడ్డితో పాటు విలేకరులు, పార్టీల నేతలు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: