ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకం అర్హలైన తమకు అందడం లేదని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం పెదగెద్దాడ పంచాయతీకి చెందిన గిరిజన మహిళలు స్థానిక సచివాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు.
తమ పంచాయతీలో 80మంది గిరిజన మహిళలకు చేయూత పథకం మంజూరు కాలేదని... ఈ పథకానికి అన్ని కులాలు ఆర్గులైనప్పటికి గిరిజనులకు కుల ధ్రువ పత్రాలు లేవంటూ కారణాలు చూపించి అనర్హులుగా ప్రకటించడం అన్యాయమన్నారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వాల్మీకి కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని, తద్వారా వార్డు స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన అధికారులకు తమ సమస్యలు కనిపించడం లేదా అని మహిళలు ప్రశ్నించారు. వాల్మీకులందరికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి... ప్రభుత్వ పథకాలను పొందేందుకు చర్యలు చేపట్టాలని .... లేకపోతే రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆమరణ దీక్ష చేపడతామని గిరిజన మహిళలు హెచ్చరించారు.
ఇవీ చదవండి: వరద బాధితులకు రూ.2 వేలు సాయం: సీఎం జగన్