పశువుల దొడ్డిపై పులి దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఇసుకపాడు గ్రామంలో జరిగింది. ఆవు మెడపై కొరికి చంపిన పులి.. తినకుండా వదిలి వెళ్లిపోయింది. రాత్రి సమయంలో పులి దాడి చేసినట్లు బాధిత రైతు పేర్కొంటున్నారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేశారు. పులి అడుగు జాడలు గుర్తించారు.
కుక్కునూరు అటవీ రేంజ్ పరిధిలో పశువులపై పులి దాడి చేయడం ఇది రెండో సారి. మూడు రోజుల క్రితం వేలేరుపాడు మండలం కావడి గుండ్ల ప్రాంతంలో రెండు పశువులను పులి చంపి తినింది. తెలంగాణ అటవీ ప్రాంత సరిహద్దు ప్రాంతాల నుంచి కుక్కునూరు ప్రాంతంలోకి పులి ప్రవేశిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువులను అడవిలోకి తీసుకెళ్లవద్దన్నారు.
ఇదీ చదవండి: